ఇంటర్వ్యూ: శర్వానంద్ – సీరియస్ పాత్రలు చేసి బోర్ కొట్టింది
Published on May 11, 2017 5:28 pm IST


‘శతమానం భవతి’ సినిమాతో మంచి హిట్ అందుకున్న శర్వానంద్ ఈ ఏడాది చేసిన రెండవ సినిమా ‘రాధ’. ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలకానుంది. ఈ సందర్బంగా ఆయన శర్వానంద్ మీడియాతో ముచ్చటించారు. ఈ విశేషాలు మీకోసం..

ప్ర) సినిమా రిలీజ్ పట్ల ఏమైనా టెంక్షన్ ఉందా ?
జ) ‘శతమానం భవతి’ రిలీజ్ తర్వాత వస్తున్న సినిమా కనులకు ఆడియన్సులో ఎక్కువ అంచనాలున్నాయి. అందుకే కాస్త టెంక్షన్ గా ఉంది.

ప్ర) ఇలాంటి కమర్షియల్ సినిమాని ఎందుకు చూజ్ చేసుకున్నారు ?
జ) నిజం చెప్పాలంటే సీరియస్ పాత్రలు, కథలు చేసి కాస్త బోర్ కొట్టింది. అందుకే ఇలాంటి సినిమా ఎంచుకున్నాను. అలాంటి పాత్రలు చేయడానికి ఇంకా సమయముంది. అందుకే ప్రస్తుతానికి సింపుల్ గా , ఎంటర్టైనింగా ఉండే సినిమాలే చేయాలనుకుంటున్నా.

ప్ర) ఈ ప్రాజెక్ట్ ఎలా వర్కవుట్ అయింది ?
జ) ఈ సినిమా ‘శతమానం భవతి’ కంటే ముందే మొదలైంది. కానీ సంక్రాంతి సీజన్ కనుక శతమానం భవతిని ఆ సీజన్లోనే రిలీజ్ చేయాలని దిల్ రాజుగారన్నారు. అందుకే ఆ సినిమాను ముందుగా కంప్లీట్ చేసి తర్వాత రాధ స్టార్ట్ చేశాం.

ప్ర) మీ పాత్ర గురించి చెప్పండి ?
జ) నా పాత్ర చాలా ఆసక్తికరంగా, ఫుల్ మాస్ తరహాలో ఉంటుంది. రాధ పోలీసాఫీసర్ ఎలా అయ్యాడు. అతను ఎలాంటి పనులు చేశాడు అనేదే ఈ సినిమా.

ప్ర) రీసెంట్ గా వచ్చిన సక్సెస్ ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ?
జ) చాలా రిలాక్స్డ్ గా ఉన్నాను. ప్రస్తుతం నా విషయంలో చాల సంతోషంగా ఉన్నాను. నా సినిమాలన్నీ మంచి ఎంటర్టైనింగా వస్తుండటం బాగుంది.

ప్ర) ‘శతమానం భవతి’ అంత పెద్ద హిట్టవుతుందని ఊహించారా ?
జ) సినిమా మంచి హిట్టవుతుందని నమ్మకమైతే ఎప్పుడూ ఉండేది కానీ మరీ అంత భారీ హిట్టవుతుందని ఊహించలేదు. ఆ సినిమాకి చాలా అభినందనలు వచ్చాయి. సినిమాని అంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు.

ప్ర) మీరు సోషల్ మీడియాలో కనిపించరేందుకు?
జ) నిజం చెప్పాలంటే నాకసలు సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ ను ఎలా వాడాలో అస్సలు తెలీదు. పైగా దానికి మన లైఫ్ నుండి చాలా టైమ్ కేటాయించాలి. ప్రస్తుతం నా లైఫ్ బాగుంది. దాన్ని డిస్టర్బ్ చేయడం నాకేమాత్రం ఇష్టం లేదు.

ప్ర) ‘రాధ’ అనే టైటిల్ వలన ఎలాంటి ఇబ్బందీ అనిపించలేదా ?
జ) లేదు అనిపించలేదు. పైగా నన్ను నేను ఎక్కువ హీరోయిజంతో చూపించాలనుకోలేదు. అందుకే సినిమాకు ఆ పేరు పెట్టాం. హీరోయిన్ పేరు కూడా రాధనే. టైటిల్ చాలా బాగా కుదిరింది.

 
Like us on Facebook