“విడుతలై” డిజిటల్ ప్రీమియర్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్!

“విడుతలై” డిజిటల్ ప్రీమియర్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్!

Published on Apr 4, 2023 8:07 PM IST

సంచలన దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వం వహించిన విడుతలై పార్ట్ 1తో కమెడియన్ సూరి హీరోగా మారాడు. తమిళంలో ఈ చిత్రం గత వారం విడుదలై విమర్శకుల నుండి మరియు ప్రేక్షకుల నుండి మంచి సమీక్షలను అందుకుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి పవర్ ఫుల్ క్యామియోలో నటించాడు. ఈ చిత్రం ను ఓటిటి ప్లాట్‌ఫారమ్ జీ5 లో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారని సోషల్ మీడియాలో బలమైన బజ్ ఉంది.

బజ్ ప్రకారం, ఈ చిత్రం ఒక నెలలోపు డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈలోగా, విడుతలై యొక్క తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఏప్రిల్ 7, 2023న పెద్ద స్క్రీన్‌లలోకి రానుంది. అయితే, విడుదల గురించి ఇంకా అధికారిక ప్రకటన లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు