అంటే ఆ సుందరం జూన్ లో వస్తాడు…ఈ సుందర్ ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేశాడు

Published on Mar 18, 2022 9:00 pm IST


నాని హీరోగా నటిస్తున్న సరికొత్త చిత్రం అంటే సుందరానికి. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ను జూన్ 10 వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని ఐపిఎల్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ సోషల్ మీడియా వేదిక గా వెల్లడించడం జరిగింది. తమ టీమ్ లోని బ్యాట్సమన్ అయిన వాషింగ్ టన్ సుందర్ ట్రైనింగ్ స్టార్ట్ చేసిన విషయాన్ని ఫన్నీ వే లో వెల్లడించారు.

అంటే ఆ సుందరం జూన్ లో వస్తాడు, ఈ సుందర్ ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేశాడు అంటూ చెప్పుకొచ్చారు. ఐపిఎల్ ఈ నెల 26 నుండి మొదలు కానున్న సంగతి అందరికీ తెలిసిందే. నాని హీరోగా నటిస్తున్న అంటే సుందరానికి చిత్రం ను మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని మరియు వై రవి శంకర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా లో హీరోయిన్ గా నజ్రియా నజీం నటిస్తుంది.

సంబంధిత సమాచారం :