లేటెస్ట్..మహేష్ ప్లానింగ్ మారిందా..?

Published on Sep 7, 2021 7:04 am IST


ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు పరశురాం పెట్ల కాంబోలో సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “సర్కారు వారి పాట” లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు ఈ సినిమా షూట్ లో బిజీ బిజీ గా ఉన్న మహేష్ దీని తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సెన్సేషనల్ దర్శకుడు రాజమౌళి తో సినిమాలను సెటప్ చేసి పెట్టుకున్నాడు. అయితే మరి మహేష్ లైనప్ పై ఇంట్రెస్టింగ్ బజ్ ఇప్పుడు వినిపిస్తోంది.

గతంలో మహేష్ సర్కారు వారి పాట ని అలాగే త్రివిక్రమ్ సినిమాని ఏకకాలంలో తక్కువ వ్యవధిలో పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నారు. మరి ఇప్పుడు ఇది మారినట్లు తెలుస్తుంది. ప్రస్తుత పరిస్థితుల రీత్యా మహేష్ ముందుగా సర్కారు వారి పాట చిత్రాన్ని ముందు ఫినిష్ చెయ్యాలని చూస్తున్నారట. ఆ తర్వాత త్రివిక్రమ్ తో సినిమాని స్టార్ట్ చేయనున్నారని టాక్. అలాగే బహుశా ఈ సినిమా నవంబర్ నెలలో స్టార్ట్ కానున్నట్టుగా సమాచారం. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :