“పుష్ప 2” కూడా ఈ రేస్ లో ఛాన్స్ ఉందా.?

Published on May 9, 2021 7:25 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “పుష్ప”. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియన్ చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. అయితే ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ కు సంబంధించి ఇటీవలే ఊహించని టాక్ బయటకి వచ్చింది.

ఈ చిత్రం ఒక్క పార్ట్ గా కాకుండా రెండు భాగాలుగా వస్తుంది అని తెలియడంతో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. అయితే పార్ట్ 1 ఈ ఏడాది అక్టోబర్ లో విడుదల్క్ చేస్తారని టాక్ ఉంది. మరి రెండో భాగం ఎప్పుడు విడుదల చేస్తారా అన్నదే మరో కీలక ప్రశ్న మరి దీనికి సమాధానంగా వచ్చే ఏడాది సగం పూర్తి కాకముందే ఉంటుంది అని తెలుస్తుంది.

మరి అలా అయితే పర్ఫెక్ట్ టైం సమ్మర్ అనే చెప్పాలి. మరి ఆ రేస్ లో ఇప్పటికే చాలా పలు ఆసక్తికర సినిమాలు ఉన్నాయి. మరి ఈ రేస్ లోనే ఈ చిత్రం కూడా నిలుస్తుందో లేదో చూడాలి మరి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :