యూట్యూబ్‌లో దూసుకుపోతోన్న ‘ఇజం’ టీజర్!

ism
దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో కళ్యాణ్ రామ్‌ల క్రేజీ కాంబినేషన్‌లో ‘ఇజం’ పేరుతో ఓ మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్‌లుక్‌తో, కళ్యాణ్ రామ్ సిక్స్‌ప్యాక్ లుక్‌తో మంచి అంచనాలను రేకెత్తించిన ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా విడుదలైన టీజర్‌తో ఆ అంచనాలను తారాస్థాయికి చేర్చింది. పూరీ మార్క్ మేకింగ్, డైలాగ్స్, కళ్యాణ్ రామ్ సరికొత్త లుక్ ఈ టీజర్‌కు మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఇక విడుదలైనప్పట్నుంచే ఈ టీజర్ యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.

48 గంటల్లోపే ఈ టీజర్ 1 మిలియన్ (10 లక్షల) వ్యూస్ సాధించడం విశేషంగా చెప్పుకోవాలి. కళ్యాణ్ రామ్ కెరీర్లోనే భారీ హైప్ ఉన్న సినిమాగా ఇజం నిలిచిందన్న విషయం టీజర్‌కు వస్తోన్న రెస్పాన్స్‌తో మరోసారి స్పష్టమైంది. ఓ సామాజిక అంశం చుట్టూ నడిచే కథతో తెరకెక్కిందన్న ప్రచారం పొందిన ఈ సినిమాను ఈ నెలాఖర్లో దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని పూరీ ప్లాన్ చేస్తున్నారు.

‘ఇజం’ టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి