అఫీషియల్ : చరణ్, గౌతమ్ ల ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్!

Published on Oct 15, 2021 9:59 am IST

ఈరోజు దసరా కానుకగా మన టాలీవుడ్ నుంచి పలు సినిమాల రిలీజ్ పండుగతో పాటుగా మరోపక్క కొత్త సినిమాలు మరిన్ని సినిమాల అనౌన్సమెంట్స్ లు కూడా వస్తున్నాయి. అయితే వీటిలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ భారీ ప్రాజెక్ట్ పై కూడా ఓ అనౌన్సమెంట్ వస్తుంది అని నిన్నటి నుంచి టాక్ ఉండగా ఈరోజు అది అధికారికంగా కన్ఫర్మ్ అయ్యింది.

టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రామ్ చరణ్ 16 వ సినిమాగా ఇప్పుడు దసరా కానుకగా అనౌన్సమెంట్ వచ్చింది. మరి ఈ ఇంట్రెస్టింగ్ చిత్రాన్ని మంచి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు తెరకెక్కించే భారీ చిత్రాల నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించనున్నారు. మొత్తానికి ఈ పండుగ నాడు మెగా అభిమానులకు ఇది మరో గుడ్ న్యూస్ అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :