‘జై సింహ, గ్యాంగ్, రంగుల రాట్నం’ కృష్ణా జిల్లా వసూళ్లు !

ఈ సంక్రాంతికి ‘అజ్ఞాతవాసి’ తో పాటు ‘జై సింహ, గ్యాంగ్, రంగుల రాట్నం’ చిత్రాలు కూడా విడుదలయ్యాయి. ఈ సినిమాలు కలెక్షన్స్ కృష్ణా జిల్లలో ఈ కింది విధంగా ఉన్నాయి. ముందుగా బాలక్రిష్ణ ‘జై సింహ’ విషయానికొస్తే 3వ రోజు రూ.18.53 లక్షలు వసూలు చేసి మొత్తంగా రూ.79.73 లక్షల్ని ఖాతాలో వేసుకుంది.

అలాగే సూర్య నటించిన ‘గ్యాంగ్’ చిత్రం 3వ రోజు రూ.6.21 లక్షల షేర్ తో మూడు రోజులకు కలిపి రూ.17.42 లక్షలు వసూలు చేయగా నిన్న విడుదలైన రాజ్ తరుణ్ ‘రంగుల రాట్నం’ రూ. 4 లక్షల షేర్ ను రాబట్టుకుంది.