త్వరలో విడుదలకానున్న ‘జై సింహ’ టీజర్ !

ఒక్క ఫస్ట్ లుక్ పోస్టర్ మినహా మరే అప్డేట్ లేని బాలక్రిష్ణ 102వ చిత్రం ‘జై సింహా’ అప్పుడే ప్రీ రిలీజ్ బిజినెస్ ను దాదాపుగా పూర్తి చేసేసింది. అంతటి క్రేజ్ ఉన్న ఈ సినిమా యొక్క టీజర్, పాటల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. సినీ వర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా యొక్క టీజర్ వచ్చేవారం విడులవుతుందని తెలుస్తోంది.

అంతేగాక మొదటి పాట కూడా ఆ వారంలోనే రిలీజవుతుందట. ఇకపోతే ఈ చిత్ర ఆడియో ఈ నెల 24న భారీ ఎత్తున జరగనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు కె.ఎస్. రవికుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో నయనతార, హరిప్రియ, నటాషా దోషిలు హీరోయిన్లుగా నటిస్తుండగా చిరంతన్ భట్ సంగీతాన్ని అందిస్తున్నారు. సంక్రాతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల్ ముందుకురానున్న ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు.