డిసెంబర్ నాటికి టాకీ పార్ట్ పూర్తిచేసుకోనున్న ‘జై సింహ’ !
Published on Nov 19, 2017 10:42 am IST

నందమూరి బాలక్రిష్ణ 102వ చిత్రం ‘జై సింహ’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్ర టాకీ పార్ట్ కు సంబందించిన ఆఖరి షెడ్యూల్ ఈ నెల 22 నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు జరగనుంది. ఈ షెడ్యూల్ మొత్తం హైదరాబాద్లోనే జరగనుంది. దీంతో టాకీ పార్ట్ వరకు పూర్తవుతుందని, కొన్ని పాటలు మాత్రమే మిగిలి ఉంటాయని తెలుస్తోంది.

చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను డిసెంబర్ 23న విడుదలచేయనున్నారు. వచ్చే ఏడాది సంక్రాతి సందర్బంగా జనవరి 12న విడుదలకానున్న ఈ చిత్రంలో నయనతార ప్రధాన హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ నటి నటాషా దోషి, హరి ప్రియలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు.

 
Like us on Facebook