తలైవర్ “జైలర్” పై క్లారిటీ రాబోతోందా.?

Published on May 4, 2023 7:05 am IST

కోలీవుడ్ సూపర్ స్టార్ తలైవర్ రజినీకాంత్ హీరోగా కోలీవుడ్ స్టార్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ హీరోగా నటిస్తున్న సాలిడ్ యాక్షన్ డ్రామా చిత్రం “జైలర్” కోసం అందరికీ తెలిసిందే. భారీ అగ్ర తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు షూటింగ్ ని మేకర్స్ శరవేగంగా కంప్లీట్ చేస్తుండగా గత కొన్నాళ్ల నుంచి అయితే సినిమా రిలీజ్ విషయంలో బజ్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రాన్ని మేకర్స్ ఆగస్ట్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్టు గా టాక్ వచ్చింది. ఇక ఈ రిలీజ్ పై అయితే క్లారిటీ వచ్చేయనున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. ఈ వారంలోనే అయితే జైలర్ రిలీజ్ అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉందట. మరి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :