“జేమ్స్” ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ మామూలుగా లేదుగా..!

Published on Mar 17, 2022 12:00 am IST


కన్నడ దివంగత హీరో పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’. చేతన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పునీత్ రాజ్‌కుమార్ జయంతిని పురస్కరించుకుని మార్చి 17న విడుదల చేయనున్నారు. పునీత్ నటించిన చివరి సినిమా కావడంతో కన్నడ ప్రేక్షకులే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా ఈ సినిమా పలు రికార్డులు క్రియేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

కేవలం కర్ణాటకలోనే రూ.65 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. కేజీఎఫ్ మినహా మరే సినిమాకు ఇది సాధ్యం కాలేదని తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే క‌ర్ణాట‌క‌లో మార్చి 17 నుంచి 24 వరకు అన్ని థియేట‌ర్ల‌లో జేమ్స్ సినిమాను మాత్ర‌మే విడుద‌ల చేయాలని డిస్ట్రిబ్యూట‌ర్లు నిర్ణ‌యించుకున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 250 థియేటర్లలో, హిందీలో దాదాపు 300 థియేటర్లలో ఈ సినిమా విడుదల అవుతుంది. ఈ సినిమాలో ప్రియా ఆనంద్ హీరోయిన్‌గా నటిస్తుండగా, టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :