కేరళ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘జనతా గ్యారెజ్’!
Published on Aug 8, 2016 11:50 am IST

janathagarage1
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న ‘జనతా గ్యారెజ్’ సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా దూసుకుపోతోన్న ఈ సినిమాను సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా పక్కాగా ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు. ఇక ఈ మధ్యే ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలక షెడ్యూల్‌ను కేరళలో మొదలుపెట్టిన టీమ్, నిన్నటితో షెడ్యూల్‌ను పూర్తి చేసి హైద్రాబాద్‌కు తిరిగి వచ్చేసింది.

‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ సినిమాలతో తెలుగులో తనదైన బ్రాండ్ సృష్టించిన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా కావడం వల్ల ఎన్టీఆర్ అభిమానులంతా తమ హీరో కెరీర్‌లో ఈ సినిమా అతిపెద్ద హిట్‌గా నిలుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఆగష్టు 12న హైద్రాబాద్‌లో దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఆడియోను పెద్ద ఎత్తున విడుదల చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది.

 
Like us on Facebook