ఆసక్తికరమైన బయోపిక్ లో జాన్వీ కపూర్ !

Published on Dec 5, 2018 5:50 pm IST


‘దఢక్’ చిత్రంతో సూపర్ హిట్ కొట్టి బాలీవుడ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్. ఇక ఆమె ఇప్పుడు జాగ్రత్తగా సినిమాలను ప్లాన్ చేసుకుంటుంది. దాంట్లో భాగంగా జాన్వీ ఒక బయోపిక్ లో నటించడానికి సిద్దమవుతుంది. మహిళా వైమానిక యోధురాలు గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా ఈ బయోపిక్ తెరకెక్కనుంది. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో గుంజన్ చేసిన సాహసాలు మరువలేనివి. అంతే కాకుండా శౌర్య వీర్ అవార్డు పొందిన మొదటి మహిళా కూడా ఆమె కావడం విశేషం.

తాజాగా ఇప్పుడు గుంజన్ పాత్రలో జాన్వీ నటించనుంది. కరణ్ జోహార్ నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాదిలో ప్రారంభం కానుంది. ఇక జాన్వీ ప్రస్తుతం ‘తక్త్’ అనే మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తుంది.

సంబంధిత సమాచారం :