సెన్సార్ పూర్తిచేసుకున్న ‘జవాన్’ !
Published on Nov 23, 2017 5:40 pm IST

సాయిధరమ్ తేజ్, మెహ్రీన్ జంటగా బివిఎస్ రవి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘జవాన్’. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఈరోజే సినిమా ట్రైలర్ కూడా విడుదలైంది. సోషల్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ యు/ఎ సర్టిఫికెట్ ను జారీ చేసింది. ‘విన్నర్’ తో సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాదించలేకపోయిన సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. నిర్మాత దిల్‌రాజు సమర్పణలో వస్తోన్న ఈ సినిమాను అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ నిర్మించారు.

 
Like us on Facebook