మహేష్ ‘మహర్షి’ లో సీనియర్ నటి !

Published on Aug 21, 2018 2:17 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 25వ చిత్రం ‘మహర్షి’ షూటింగ్ ప్రస్తుతం గోవా లో జరుగుతుంది. ఇక ఈ చిత్రంలో మహేష్ తల్లిగా పాత తరం హీరోయిన్ జయప్రద నటిస్తున్నారు. చాలా రోజల తరువాత ఈచిత్రంతో మళ్ళీ ఆమె తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నారు. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో ప్రముఖ హీరో అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్విని దత్, పివిపి లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదలకానుంది. ఇక ‘భరత్ అనే నేను’ చిత్రం తరువాత మహేష్ నటిస్తున్న ఈ చిత్రం ఫై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :

X
More