.ఎన్టీఆర్ కోసం కమల్ హాసన్ ప్లేస్ లో మోహన్ లాల్ ?

.ఎన్టీఆర్ కోసం కమల్ హాసన్ ప్లేస్ లో మోహన్ లాల్ ?

Published on Jul 4, 2022 12:43 AM IST

పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ తో ఓ భారీ యాక్షన్ డ్రామా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 31వ సినిమాగా ఈ చిత్రం రాబోతుంది. ఈ చిత్రంలో మరో కీలక పాత్ర కూడా ఉందట. ఈ పాత్ర సినిమాకే మెయిన్ హైలైట్ గా నిలుస్తోందట. అందుకే, ఈ పాత్ర కోసం కమల్ హాసన్ ను ఒప్పించాలని ప్రశాంత్ నీల్
ప్రయత్నాలు చేస్తున్నట్లు రీసెంట్ గా వార్తలు వినిపించాయి. అయితే.. విక్రమ్ భారీ సక్సెస్ తో కమల్ హాసన్ ఈ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపించడం లేదు.

అందుకే.. ప్రశాంత్ నీల్ ఆ పాత్ర కోసం మోహన్ లాల్ ను సంప్రదించాలని ప్లాన్ చేస్తున్నాడు.మరి ఈ రూమర్స్ లో ఎంత నిజం ఉందో చూడాలి. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొణెను హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉంది టీమ్. ఇక ఈ చిత్రం రెగ్యులర్ షూట్ ను ప్రశాంత్ నీల్ అక్టోబర్‌ నుంచి ప్లాన్ చేస్తున్నాడు. అక్టోబర్‌ సెకండ్ వీక్ నుంచి ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లనుంది.

ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో సినిమా వస్తోంది అనేసరికి నేషనల్ రేంజ్ లో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కి, ప్రశాంత్ నీల్ యాక్షన్ విజువల్స్ తోడు అయితే.. మరో వండర్ ఫుల్ సినిమా అయ్యే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు