‘రా ఆఫీసర్’గా ‘వేశ్య’గా కాజల్ అగర్వాల్ ?

Published on Jul 4, 2021 1:56 am IST

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా కాజల్ ఈ సినిమాలో సరికొత్త పాత్రలో కనిపించనుంది. కాజల్ ఒక ‘రా ఆఫీసర్’గా నటిస్తోంది. నాగార్జున ఎక్స్ రా-ఏజెంట్ గా కనిపిస్తాడు. నాగార్జునకు పూర్తిస్థాయిలో సహకారం అందించే పాత్రలో కాజల్ అగర్వాల్ పాత్ర ఉంటుందట. అలాగే ఈ సినిమాలో కీలక సన్నివేశాల్లో ఆమె ఒక వేశ్యగా కనిపిస్తోందట.

వేశ్యగా తీవ్రవాదులను ఆకట్టుకుంటూ వారి రహస్యాలను డిపార్ట్మెంట్ కి చేరవేసే పాత్ర కాజల్ ది అని తెలుస్తోంది. ఇక ఈ సినిమా మొత్తం, ఫుల్ యాక్షన్ తో సాగేలా ఉంది. ఈ సినిమా కోసం కాజల్ యాక్షన్ సీక్వెన్స్ లో కూడా పాల్గొనాల్సి ఉంది. స్పై సీన్స్, వేశ్య సీన్స్ ఇలా రెండు రకాల సీన్స్ తో కాజల్ మొత్తానికి మెప్పించనుంది. కాజల్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

సంబంధిత సమాచారం :