కళ్యాణ్ రామ్ “డెవిల్” సెట్స్ నుండి టీమ్ పిక్ రిలీజ్!

కళ్యాణ్ రామ్ “డెవిల్” సెట్స్ నుండి టీమ్ పిక్ రిలీజ్!

Published on Dec 21, 2022 12:08 PM IST

నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార చిత్రం విజయం తో దూసుకు పోతున్నాడు. అయితే కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ డెవిల్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రం లో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం సెట్స్ లో నుండి ఒక ఫోటో ను చిత్ర యూనిట్ షేర్ చేయడం జరిగింది. టీమ్ కోర్ టెక్నికల్ కి సంబంధించిన సభ్యులతో ఫోటో ఉంది.

ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామ నిర్మిస్తున్నారు. హర్ష వర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నవీన్ మేడారం దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కళ్యాణ్ రామ్ ఈ చిత్రం తో పాటుగా మరికొన్ని చిత్రాలను లైన్ లో పెడుతున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు