క్లారిటి ఇచ్చిన కమల్ హసన్ !
Published on Oct 17, 2017 1:34 pm IST


మరో సంచలన చిత్రాన్ని దిల్ రాజు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విలక్షణ నటుడు కమలహాసన్ నటించిన ‘భారతీయుడు’ సినిమా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘ఇండియన్ -2’ చిత్రాన్ని శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

తాజాగా ఈ ప్రాజెక్ట్ నుండి కమలహాసన్ తప్పుకుంటున్నట్లు, ఆయన ఈ సినిమా చెయ్యడం లేదనే వార్తా బయటికి వచ్చింది. అయతే ఈ విషయం పై కమల్ హసన్ తాజా ఇంటర్వ్యూ లో ఈ విషయం పై క్లారిటి ఇవ్వడం జరిగింది. భారతీయుడు సీక్వెల్ ప్రాజెక్ట్ నుండి తను తప్పుకోలేదని, ఆ సినిమా చెయ్యడానికి తను సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు. శంకర్ రోబో2 వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదల కానుంది, ఈ సినిమా తరువాత కమల్ హసన్ తో ‘ఇండియన్-2’ మొదలుపెట్టబోతున్నాడు శంకర్.

 
Like us on Facebook