యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టిన కమల్ !
Published on Jun 11, 2018 5:43 pm IST

నటన కోసం ఎలాంటి సాహసమైన చేయడానికి వెనుకాడని నటుల్లో కమల్ హాసన్ కూడ ఒకరు. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోగలరు కాబట్టే ఆయనకు విశ్వనటుడు అనే బిరుదును కట్టబెట్టారు ప్రేక్షకులు. ఆ బిరుదుకు మరోసారి న్యాయం చేశారాయన. ఆయన నటించిన తాజా చిత్రం ‘విశ్వరూపం-2’ ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది.

ట్రైలర్ మొత్తం హెవీ యాక్షన్ సన్నివేశాలే ఉన్నాయి. ఒట్టి ట్రైలర్లోనే ఇన్ని ఉంటే ఇక పూర్తి సినిమాలో ఎన్ని ఉంటాయో ప్రత్యేకించి చెప్పెనక్కర్లేదు. ట్రైలర్ చూసిన వారంతా కమల్ ఆరు పదుల వయసులో కూడ ఒక పాత్రలో అన్ని వేరియేషన్స్ చూపడం, భారీ యాక్షన్ సన్నివేశాలు చేయడం పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. కమల్ స్వయంగా నిర్మిస్తూ, దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగష్టు 10న విడుదలకానుంది.

ట్రైలర్ విడుదల కార్యక్రమంలో కమల్ మాట్లాడుతూ ఈ సినిమా మొదటి భాగం ‘విస్వరూపం’కు ప్రీక్వెల్, సీక్వెల్ లాంటిదని, మొదటి పార్ట్ విడుదలకు వచ్చిన ఇబ్బందులు ఇప్పుడు తలెత్తవని ఆశిస్తున్నానని అన్నారు.

ట్రైలర్ కొరకు క్లిక్ చేయండి :

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook