‘ఇండియన్ -2’ ఎలా ఉండబోతుందో చెప్పిన కమల్ !
Published on Jun 12, 2018 4:47 pm IST


21 సంవత్సరాల క్రితం విడుదలైన శంకర్, కమల్ హాసన్ ల ‘ఇండియన్’ చిత్రం సౌత్ క్లాసిక్ సినిమాల జాబితాలో ఒకటిగా నిలబడిపోయింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రూపొందించే పనులు జరుగుతున్నాయి. శంకర్ ఈ సీక్వెల్ ను డైరెక్ట్ చేయనున్నారు. కొన్ని నెలల క్రితమే ఈ సినిమాని అనౌన్స్ చేయడం జరిగింది.

తాజాగా జరిగిన ‘విశ్వరూపం-2’ ట్రైలర్ లాంచ్ వేడుకలో కమల్ హాసన్ మాట్లాడుతూ ‘ఇండియన్-2’ పూర్తి పొలిటికల్ నేపథ్యంలో జరిగే సినిమా అని, ప్రస్తుత రాజకీయాల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న వ్యక్తుల గురించిన కథే సినిమా అని అన్నారు. అయితే సినిమా ఎప్పుడు మొదలవుతుంది, నిర్మాతలు, ఇతర నటీనటులెవరు అనే వివరాలను బయటపెట్టలేదు కమల్. ఇకపోతే ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందివ్వనున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook