గ్రాండియర్ విజువల్ ట్రీట్ గా ఆకట్టుకుంటున్న ‘కంగువ’ సిజిల్ టీజర్

గ్రాండియర్ విజువల్ ట్రీట్ గా ఆకట్టుకుంటున్న ‘కంగువ’ సిజిల్ టీజర్

Published on Mar 19, 2024 6:02 PM IST

కోలీవుడ్ స్టార్ యాక్టర్ సూర్య హీరోగా శివ దర్సకత్వంలో స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ సంస్థల పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితం అవుతోన్న లేటెస్ట్ ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కంగువ. మొదటి నుండి అందరిలో ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకోగా నేడు మూవీ నుండి ప్రత్యేకంగా సిజిల్ టీజర్ ని రిలీజ్ చేసారు. ఇక ఈ టీజర్ లో సూర్య పవర్ఫుల్ లుక్స్, స్టైల్, యాక్షన్, ఫైట్స్ తో పాటు గ్రాండియర్ విజువల్స్, విఎఫ్ఎక్స్ వర్క్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి అదిరిపోయాయి.

మొత్తంగా ప్రస్తుతం ఈ టీజర్ అందరినీ అలరిస్తూ యూట్యూబ్ లో మంచి వ్యూస్ రాబడుతోంది. దిశా పటాని హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీని ఈ ఏడాదిలోనే ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు