కర్ణాటకలో భారీ రికార్డు సెట్ చేసిన “కాంతారా”.!

కర్ణాటకలో భారీ రికార్డు సెట్ చేసిన “కాంతారా”.!

Published on Nov 10, 2022 9:00 AM IST

కన్నడ స్టార్ట్ హీరో రిషబ్ శెట్టి హీరోగా తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ సెన్సేషనల్ డివోషనల్ హిట్ చిత్రం “కాంతారా”. కన్నడ సహా తెలుగు మరియు హిందీ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ అయ్యి అదిరే వసూళ్లతో ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ స్ట్రాంగ్ గా కొనసాగుతూ భారీ లాభాలు అందించి పెడుతుంది. ఇక ఈ చిత్రం అయితే లేటెస్ట్ గా కర్ణాటక లో భారీ రికార్డు నమోదు చేసినట్టు ఇప్పుడు తెలుస్తుంది.

మరి ఒక్క కర్ణాటక లోనే ఈ చిత్రం ఏకంగా ఒక కోటికి పైగా టికెట్లు అమ్ముడుపోయినట్టుగా ఇపుడు తెలుస్తుంది. దీనితో 1 కోటి టికెట్స్ అమ్ముడు పోయిన చిత్రంగా కాంతారా ఇప్పుడు అక్కడ భారీ రికార్డు నెలకొల్పింది. ఇక ఈ సూపర్ హిట్ చిత్రంలో సప్తమి గౌడ హీరోయిన్ గా నటించగా అజనీష్ లోకనాథ్ సంగీతం అందించాడు. అలాగే హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు