ఇంటర్వ్యూ : కశ్మీర పరదేశి – ఐ లవ్ అల్లు అర్జున్ అండ్ మహేష్ బాబు !

Published on Aug 26, 2018 4:33 pm IST

నూతన దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా కశ్మీర పరదేశి, యామిని భాస్కర్ హీరోయిన్లుగా రాబోతున్న చిత్రం ‘@నర్తనశాల’. ఐరా క్రియేషన్స్ పతాకం ఫై నాగశౌర్య తల్లి ఉషా మూల్పూరి నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రధానంగా లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో రూపొందింది. కాగా ఈ చిత్రం ఆగష్టు 30న విడుదల అవ్వబోతుంది. ఈ సంధర్బంగా ఈ చిత్ర హీరోయిన్ కశ్మీర పరదేశి మీడియా తో మాట్లాడారు. ఇప్పుడు ఆ విశేషాలు మీ కోసం.

నర్తనశాల చిత్రంలో మీకు అవకాశం ఎలా వచ్చింది ? అలాగే మీ గురించి కూడా చెప్పండి ?
నా పేరు కశ్మీర పరదేశి, మాది పూణే. నేను ముంబాయ్ లోని నిప్ట్ నుండి నా స్టడీస్ ని పూర్తిచేశాను. ఆ తర్వాత మోడలింగ్, థియేటర్ చేశాను. సమ్ యాడ్స్ లో కూడా యాక్ట్ చేశాను. ఆ ప్రాసెస్ లో నర్తనశాల ఆడియన్స్ కి రావటం, సెలెక్ట్ అవ్వటం జరిగింది. డైరెక్టర్ శ్రీనివాస్ గారికి థాంక్స్ చెప్పాలి.

మీకు నర్తనశాల మొదటి సినిమానా ?
అవును. నర్తనశాలనే నా డెబ్యూ మూవీ. ఈ సినిమాలో చాలా నేర్చుకున్నాను.

మీరు పూణే నుంచి వచ్చారు. మరి ఇంతకు ముందే తెలుగు ఇండస్ట్రీ గురించి, తెలుగు సినిమాల గురించి తెలుసా ?
తెలుసండి. తెలుగు సినిమాలు పూణే లో, ముంబాయ్ లో కూడా డబ్ అవుతాయి. నాకు పర్సనల్ గా తెలుగు లాంగ్వేజ్ అర్ధం కాకపోయినా తెలుగు సినిమాలు రెగ్యూలర్ గా చూసేదాన్ని. తెలుగు సినిమాలో చాలా రకాల ఎమోషన్స్ ఉంటాయి. రొమాన్స్, లవ్, కామెడీ, ఫైట్ ఇలా అన్ని ఎమోషన్స్ బ్యాలెన్డ్ గా ఉంటాయి. అలాగే చాలా ఎంటర్ టైన్ గా కూడా ఉంటాయి. రియల్లీ ఐ లైక్ తెలుగు మూవీస్.

తెలుగు మూవీస్ రెగ్యూలర్ గా చూస్తా అన్నారు. మరి తెలుగు హీరోల్లో ఏ హీరో అంటే ఇష్టం ?
నేను తెలుగులో అందరీ హీరోలు సినిమాలు చూస్తాను. అందరూ ఇష్టమే. కానీ అల్లు అర్జున్ అండ్ మహేష్ బాబు అంటే ఇంకా ఇష్టం. అలాగే మెగాస్టార్ చిరంజీవిగారికి కూడా నేను పెద్ద అభిమానిని. ఈ ముగ్గురి సినిమాలు మాత్రం నేను అస్సలు మిస్ కాను. వీరి అన్ని సినిమాలు చూస్తాను.

‘నర్తనశాల’లో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి ?
నా క్యారెక్టర్ గురించి చెప్పాలంటే వెరీ సింపుల్ గర్ల్. అండ్ వెరీ కామ్, ఇన్నోసెంట్ గర్ల్. ఎంత ప్రాబ్లమ్ వచ్చిన పేస్ చేస్తోంది గాని ఫైట్ చెయ్యదు. ఈ సినిమాలో టీచర్ గా కనిపిస్తాను. కిడ్స్ కి టీచింగ్ చేస్తాను.

యాక్టింగ్ లో మీ స్ట్రెంత్ ఏమిటి ?
స్ట్రెంత్ అంటే ప్రత్యేకంగా ఏం చెప్పాలో తెలియట్లేదు. కానీ లవ్ అండ్ రోమాంటిక్ సీన్స్ కావొచ్చు, ఇన్నోసెంట్ పెర్ఫామెన్స్ కి సంబంధించిన క్యారెక్టర్స్ కావొచ్చు. ఇలాంటివి బాగా చేస్తాను అని నమ్ముతున్నాను.

నాగశౌర్యతో కలిసి నటించడం మీకు ఎలా అనిపించింది ?
చాలా హ్యాపీగా అనిపించింది. తను నిజంగా లవ్లీ అండి. నాకు కెమరా ఫేసింగ్ గాని, ఎమోషన్స్ సీన్స్ లో కూడా శౌర్య చాలా హెల్ప్ చేశారు. ఆయన వెరీ డీసెంట్ అండ్ వెరీ నైస్. ఆయన అమ్మగారు కూడా కాస్ట్యూమ్స్ విషయంలో చాలా ఫ్రీడమ్ ఇచ్చారు.

మీరు డాన్సర్ అని విన్నాము ?
అవును, నేను కథక్ డాన్సర్ ని. బేసిగ్గా నాకు డాన్స్ కారణంగా యాక్టింగ్ మీద ఆసక్తి కలిగింది. చిన్నప్పటినుంచి కథక్ డాన్స్ నేర్చుకున్నాను.

మీకు అల్లు అర్జున్ అంటే బాగా ఇష్టం అన్నారు. ఎందుకు ?
ఐ లవ్ అల్లు అర్జున్. ఇక ఎందుకు అంత ఇష్టం అంటే ఆయన ఎనర్జీ గాని, ఆయన డాన్స్ స్పీడు గాని నాకు చాలా బాగా ఇష్టం.

మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారు ?
(నవ్వుతూ) అంత బాగా మాట్లాడలేను అండి. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను.

మీ తదుపరి ప్రాజెక్ట్ లు ఏమిటి ?
సిద్దార్ధ్ అండ్ జీవి ప్రకాష్ కాంబినేషన్ లో వస్తున్న ఓ తమిళ సినిమాలో యాక్ట్ చేస్తున్నాను. ఆ సినిమాకి శశిగారు డైరెక్టర్. ఆ సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ చేస్తున్నాను.

సంబంధిత సమాచారం :

X
More