డిజిటల్ ప్రీమియర్ కి రెడీ అయిన “కీడా కోలా”

డిజిటల్ ప్రీమియర్ కి రెడీ అయిన “కీడా కోలా”

Published on Dec 19, 2023 5:00 PM IST

టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కీడా కోలా. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను కూడా రాబట్టడం జరిగింది. ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ గా మరోసారి ఆడియెన్స్ ను అలరించడానికి రెడీ అయిపోయింది. ఈ చిత్రం డిసెంబర్ 29, 2023 నుండి ప్రముఖ తెలుగు ఓటిటి ప్లాట్ ఫారం అయిన ఆహా వీడియో లో ప్రసారం కానుంది.

అయితే గోల్డ్ సబ్ స్క్రైబర్స్ కి ఈ సినిమా 24 గంటలు ముందుగానే చూసే అవకాశం ఉంది. బ్రహ్మానందం, తరుణ్ భాస్కర్, చైతన్య రావు, రాగ్ మయూర్, రఘురాం, రవీంద్ర విజయ్, జీవన్ కుమార్, విష్ణు, హరికాంత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించారు. డిజిటల్ ప్రీమియర్ గా ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు