ఆత్మహత్య పరిష్కారం కాదంటున్న కీర్తి సురేష్

2nd, September 2017 - 07:10:12 PM

వైద్య కోర్సులను అభ్యసించేందుకు అవసరమైన ప్రవేశ పరీక్ష నీట్ విషయంలో తమిళనాడులో సంధిగ్దత నెలకొని ఉంది. దీనితో విద్యార్థిని అనిత (19) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అనిత మృతిపై సినీ రాజకీయ ప్రముఖులంతా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అనిత మృతి పై హీరోయిన్ కీర్తి సురేష్ స్పందించింది. అనిత మృతి పట్ల కీర్తి సురేష్ సంతాపం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా వేదికగా కీర్తి సురేష్ యువత కు విజ్ఞప్తి చేసింది.

ఏదైనా సాధించాలి అనుకుంటే దానికి చావు రూపం లో పరిష్కారం లభించదని తెలిపింది. విద్యార్థిని అనిత తన లక్ష్యాలని నెరవేర్చుకోలేక పోయారని కీర్తి సురేష్ ట్వీట్ చేసింది. మనం ఓ మహిళా శక్తిని కోల్పోయాం అని కీర్తి తన ట్విట్టర్ ద్వారా రాసుకొచ్చింది. సూపర్ స్టార్ రజిని కాంత్ కూడా అనిత మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.