మళ్లీ థియేటర్లలో విడుదలైన యష్ “కేజీఎఫ్ చాప్టర్ 1”

Published on Apr 8, 2022 2:02 pm IST


కేజీఎఫ్ చాప్టర్ 2 తో యష్ మళ్లీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడానికి సిద్ధమవుతున్న తరుణంలో, ఫ్రాంచైజీ నిర్మాతలు కొత్త ప్లాన్‌తో ముందుకు వచ్చారు. కేజీఎఫ్ చాప్టర్ 1 ని దేశవ్యాప్తంగా చాలా పరిమిత స్క్రీన్‌ లలో విడుదల చేయాలనుకుంటున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈరోజు నుండి, కేజీఎఫ్ 2 విడుదలయ్యే వరకు చాలా తక్కువ స్క్రీన్‌లలో కేజీఎఫ్ చాప్టర్ 1 ప్రదర్శించబడుతుంది.

అదృష్టవశాత్తూ, హైదరాబాద్‌లోని కేజీఎఫ్ అభిమానులు కూడా ఈ రోజు నుండి సినిమాను చూడవచ్చు. యష్ రాకీ పాత్రను చూడాలనుకునే వారు పెద్ద స్క్రీన్‌లపై చూడవచ్చు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన, కేజీఎఫ్ 2 ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. హోంబలే ఫిలింస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్ మరియు ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏప్రిల్ 14, 2022 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :