హిందీ “జెర్సీ” ఓపెనింగ్స్ పై “కేజీయఫ్ 2” ఎఫెక్ట్.!

Published on Apr 23, 2022 12:00 pm IST

బాలీవుడ్ సినిమా దగ్గర భారీ అంచనాలు నెలకొల్పుకొని విడుదల అయ్యిన పాన్ ఇండియా సినిమా “కేజీయఫ్ 2” ఇప్పటికీ హవా కొనసాగిస్తోంది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాపై బాలీవుడ్ లో కూడా నెలకొన్న హైప్ కి పలు స్టార్ హీరోల సినిమాలు కూడా తప్పుకోవాల్సి వచ్చింది.

అలా అక్కడ మంచి అంచనాలు ఉన్న సినిమా “జెర్సీ” కూడా ఈ వారానికి షిఫ్ట్ అయ్యింది. మని ఎమోషనల్ స్పోర్ట్స్ ఎంటర్టైనర్ గా షాహిద్ కపూర్ నుంచి వచ్చిన ఈ సినిమా మన తెలుగు సినిమా “జెర్సీ” కి రీమేక్ గా వచ్చింది. అయితే అక్కడ కూడా ప్రీమియర్ కి మంచి స్పందన కూడా రాగా ఓపెనింగ్స్ పరంగా మాత్రం అనుకున్న స్థాయి వసూళ్ళని అందుకోలేదు.

ఫస్ట్ డే కూడా ఈ సినిమా కన్నా కేజీయఫ్ 2 కు మూడు రెట్లు అధిక వసూళ్లు వచ్చాయని తెలుస్తుంది. దీనితో జెర్సీ ఓపెనింగ్స్ పై కేజీయఫ్ 2 ఎఫెక్ట్ బాగానే ఉందని చెప్పాలి. అయితే పాజిటివ్ రిపోర్ట్స్ బాగానే ఉన్నాయి కాబట్టి సినిమా మరింత పుంజుకునే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :