వైరల్ : తెలుగు సినిమా, మెగాస్టార్ పై “కేజీయఫ్” దర్శకుడి ఆసక్తికర వ్యాఖ్యలు.!

Published on Apr 12, 2022 10:00 am IST

ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర తమ సినిమాలతో సౌత్ ఇండియా వైపు చూసేలా చేసిన దర్శకుల్లో కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఒకడని చెప్పాలి. తాను చేసిన “కేజీయఫ్” సిరీస్ తో ఇండియన్ సినిమా దగ్గర ఎనలేని క్రేజ్ ని తాను తెచ్చుకున్నాడు.

దీనితో తన ఒక్కో సినిమా ఇప్పుడు భారీ అంచనాలు నెలకొల్పుకొని భారీ మార్కెట్ ని సంపాదించుకున్నాయి. అయితే లేటెస్ట్ గా తన కేజీయఫ్ చాప్టర్ 2 రిలీజ్ కి సిద్ధంగా ఉండగా తాను తెలుగు సినిమాపై మరియు టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి పై పలు ఆసక్తికర కామెంట్స్ చెయ్యడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తన సినిమాలలో మాసివ్ ఎలిమెంట్స్ కి గాను తన ఎలివేషన్స్ కి గాను తెలుగు సినిమానే చాలా ప్రేరణ కలిగించింది అని 90 లలో అయితే నా ఫేవరెట్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారే అని ఆయన్ని చూపించే మాస్ సీన్స్ గాని ఎలివేషన్స్ గాని నన్ను చాలా ప్రభావితం చేసేవి అని తెలిపాడు. దీనితో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం :