బుల్లితెర పై “హనుమాన్” కి అద్దిరిపోయిన రెస్పాన్స్!

బుల్లితెర పై “హనుమాన్” కి అద్దిరిపోయిన రెస్పాన్స్!

Published on May 9, 2024 4:00 PM IST

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హీరో మూవీ హను మాన్ (Hanuman). ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లు రాబట్టి, సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ చిత్రం ఇటీవల వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జీ తెలుగు ఛానెల్ లో ప్రసారం అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం కి సంబందించిన టీఆర్పీ రేటింగ్ వెలువడింది.

ఈ చిత్రం 10.26 టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఇది సూపర్ రెస్పాన్స్ అని చెప్పాలి. బుల్లితెర పై ఈ ఏడాది ఆదికేశవ (10.47) తర్వాత హనుమాన్ కి అత్యధికంగా రేటింగ్ వచ్చింది. అమృత అయ్యర్ ఫీమేల్ లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రం లో వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు