ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముస్తాబవుతున్న ‘కెజియఫ్’ !

Published on Dec 9, 2018 1:30 pm IST

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం ‘కెజియఫ్’. ఇప్పటికే ఐదు భాషల్లో విడుదలైన ఈ చిత్ర ట్రైలర్స్ అత్యధిక వ్యూవ్స్‌ తో సినిమా పై భారీ అంచనాలను పెంచాయి.

కాగా తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా జరుపుకోనుంది. ఈ రోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిముషాలకు ‘కెజియఫ్’ ఈవెంట్ మొదలుకానుంది. ఈ ఈవెంట్ కి కన్నడ రాకింగ్ స్టార్ యష్ తో పాటు చిత్రబృందం అలాగే ప్రత్యేక అతిధులు కూడా రానున్నారు.

కాగా లెజెండరీ నటులు కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిల్మ్స్ పతాకం పై ఈ చిత్రం రూపొందింది. విజయ్ కిరగందూర్ నిర్మాణంలో భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాను, వారాహి చలన చిత్ర బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి తెలుగులో విడుదల చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :