“ఖిలాడి” నుండి ఇంట్రస్టింగ్ క్యారెక్టర్ ను రివీల్ చేసిన టీమ్

Published on Jan 30, 2022 9:27 pm IST

మాస్ మహారాజా, రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఖిలాడీ. ఈ సినిమాలోని కీలక నటీనటుల క్యారెక్టర్ పోస్టర్‌లను చిత్ర యూనిట్ విడుదల చేసింది. నిన్న, స్టార్ నటుడు అర్జున్ ఉన్న ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసిన టీమ్, నేడు మరొక నటుడి పోస్టర్‌తో ముందుకు వచ్చారు.

యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో హోం మంత్రి గురు సింహం పాత్రలో సీనియర్ నటుడు ముఖేష్ రిషి క్యారెక్టర్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. రమేష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి కథానాయికలు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు, ఫిబ్రవరి 11, 2022 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :