సమీక్ష : “కింగ్ ఆఫ్ కొత్త” – రొటీన్ గా సాగే బోరింగ్ యాక్షన్ డ్రామా

Published on Aug 25, 2023 3:03 am IST
King Of Kotha Movie Review in Telugu

విడుదల తేదీ : ఆగస్టు 24, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: దుల్కర్ సల్మాన్, ప్రసన్న, శబీర్ కల్లారక్కల్, గోకుల్ సురేష్, ఐశ్వర్య లక్ష్మీ, నైలా ఉష

దర్శకుడు : అభిలాష్ జోషీ

నిర్మాతలు: దుల్కర్ సల్మాన్, జీ స్టూడియోస్

సంగీతం: జేక్స్ బెజాయ్, శాన్ రెహ్మాన్

సినిమాటోగ్రఫీ: నిమిష్ రవి

ఎడిటర్: శ్యామ్ శశిధరన్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ అభిలాష్ జోషీ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ కింగ్ ఆఫ్ కొత్త నేడు వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ అయ్యింది. రిలీజ్ కి ముందు మంచి హైప్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం, అందుకు అనుగుణంగా ఉందో లేదో సమీక్ష లోకి వెళ్ళి చూద్దాం.

 

కథ:

 

కింగ్ ఆఫ్ కొత్త చిత్రంలో కన్నా భాయ్ (షబీర్ కల్లరక్కల్) కొత్త ను ఏలుతూ ఉంటాడు. యువత డ్రగ్స్ కి బానిస అయ్యి ఊరు లో అంతా కన్నా భాయ్ రాజ్యం ఎలుతుంది. అయితే డ్రగ్స్ ను ఊర్లో అంతం చేయడానికి కొత్తగా సిఐ (ప్రసన్న) ఊరిలోకి వస్తాడు. కన్నా భాయ్ ను ఎదుర్కోవడం అంతా సులభం కాదు అని గ్రహిస్తాడు. ఇంతలో ఐశ్వర్య లక్ష్మీ డ్రగ్స్ ను అంతం చేయడానికి పలు రకలుగా ప్రయత్నిస్తూ, వివరాలు అన్నీ కూడా సిఐ (ప్రసన్న) కి తెలియజేస్తుంది.

ఈ ఊరిలోకి రాజు (దుల్కర్ సల్మాన్) రావడం ముఖ్యం అని ప్రసన్న అర్దం చేసుకుంటాడు. అనైఖా సురేంద్రన్ డేంజర్ లో ఉంది అంటూ రాజు కి విషయం తెలుస్తుంది. రాజు, కన్నాభాయ్ లకు జరిగిన గొడవ ఏమిటి? స్నేహితులు గా ఉన్న వీరు ఎందుకు విడిపోయారు? అనైఖా సురేంద్రన్ ప్రమాదం లో ఉంది అంటే, హీరో ఎందుకు తిరిగి వస్తాడు? ఆ ఊరిలో గంజాయి, డ్రగ్స్ ను పూర్తి స్థాయిలో హీరో రాజు నిర్ములించాడా? ఐశ్వర్య లక్ష్మీ తో రాజు ప్రేమ సఫలం అయ్యిందా? లాంటి ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో ఉన్నాయి.

 

ప్లస్ పాయింట్స్:

 

ఈ సినిమాలో హీరో దుల్కర్ సల్మాన్ నటన బాగుంది. రాజు గా ఆకట్టుకొనే నటనను కనబరిచారు. ప్రధాన నటీనటుల పర్ఫార్మెన్స్ బాగుంది. ఫ్రెండ్ షిప్, ప్రేమ కి సంబందించిన సన్నివేశాలు సినిమాలు ఆకట్టుకున్నాయి.

సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశాల్ని హైలైట్ చేయడం జరిగింది. అక్కడక్కడా వచ్చే డైలాగులు, ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయి. హీరో దుల్కర్ సల్మాన్ ఫుట్ బాల్ ప్లేయర్ గా చాలా బాగా నటించారు. ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో చిత్రీకరణ ఆకట్టుకుంటుంది.

సినిమాలో అనుకోకుండా వచ్చే కొన్ని ట్విస్టు లు ఆకట్టుకుంటాయి. హీరో హీరోయిన్ ల మధ్యన సీన్స్ బాగున్నాయి. నెగటివ్ రోల్ లో చేసిన షబీర్ కల్లరక్కల్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. సినిమాలో ఫైట్ సన్నివేశాలు ఆడియెన్స్ ను అలరిస్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది.

 

మైనస్ పాయింట్స్:

 

రన్ టైమ్ సినిమాకి అతి పెద్ద మైనస్ పాయింట్. సినిమా చాలా సాగతీత గా ఉంది. అవసరం లేని సన్నివేశాలు సినిమాలో చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా వరకు సినిమాలో సన్నివేశాలు సైడ్ ట్రాక్ ను కలిగి ఉన్నాయి.

సినిమాలో ఫైట్స్ ఎక్కువగా ఉన్నాయి. కథ ఏదైనా కొత్తగా మలుపు తిరిగింది అని అనుకొనే లోపే, అదే రోటీన్ సీన్స్ తో బోరింగ్ గా అనిపిస్తుంది.

సినిమాలో చాలా సన్నివేశాలు, కథ ఎక్కడో ఒక దగ్గర చూసిన సన్నివేశాలు గా కనిపిస్తాయి. సినిమా అంత ఎంగేజింగ్ గా సాగదు. ఇలాంటి గ్యాంగ్ స్టర్ చిత్రాలకి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉండాలి.

సినిమాలో హీరోను చాలా బాగా చూపించినా, కథ మాత్రం అంత ఆసక్తికరం గా సాగదు. రివెంజ్ సన్నివేశాలు ఆడియెన్స్ ను కాస్త అలరించినా, చాలా వరకు నాటకీయంగా అనిపిస్తాయి.

 

సాంకేతిక విభాగం:

 

డైరెక్టర్ అభిలాష్ జోషీ చెప్పాలనుకున్న స్టోరీ ఓకే అనిపిస్తుంది. కానీ, దానిని ప్రెజెంట్ చేసిన విధానం అంత బాగోలేదు. హీరోను ఎలివేట్ చేసిన సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది.

సినిమాలో నటించిన నటీనటుల నటన బాగానే ఉంది. ఎడిటింగ్ టీమ్ కొంచెం వర్క్ చేసి ఉండి ఉంటే బాగుండేది. సినిమాను రిచ్ గా చూపించడం లో నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

తీర్పు:

 

మొత్తం మీద, కింగ్ ఆఫ్ కొత్త లాంగ్ రన్ టైమ్ ను కలిగి ఉన్న బోరింగ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా. దుల్కర్ సల్మాన్ ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకున్నాడు. కన్నాభాయ్ పాత్రలో నటించిన షబీర్ కల్లరక్కల్ నుండి మంచి సపోర్ట్ ను పొందాడు. కానీ రొటీన్ కథ, సాగతీత కారణం గా సినిమా చాలా బోరింగ్ గా సాగింది. ఈ వారాంతంలో కింగ్ ఆఫ్ కొత్త ఆడియెన్స్ ను నిరాశపరిచింది అని చెప్పాలి.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :