కిరాక్ పార్టి విడుదల తేది ఖరారు !
Published on Feb 19, 2018 3:09 pm IST

హీరో నిఖిల్ నటించిన ‘కిరాక్ పార్టీ’ సినిమా టీజింగ్ టీజర్ ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందింది. ఈ మూవీని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తుండగా శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. నిఖిల్ నటించిన ఈ 15వ సినిమాను మార్చి 22న విడుదల కానుంది.

ఈ సినిమాలో నిఖిల్ సరసన సిమ్రన్ పర్జీనా, సంయుక్త హెగ్డేలు హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ కోసం డైరెక్టర్ సుధీర్ వర్మ స్ర్రీన్ ప్లే అందించగా మరో దర్శకుడు చందూ మొండేటి సంభాషణలు సమకూర్చారు. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు. ఈ సినిమా తరువాత తమిళ్ ‘కనితన్’ రీమేక్ లో నటించబోతున్నాడు నిఖిల్. త్వరలో ప్రారంభంకానున్న ఈ సినిమాను ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు.

 
Like us on Facebook