చివరి షెడ్యూల్ జరుపుకుంటున్న “నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని” చిత్రం..!

Published on Jun 13, 2022 11:00 pm IST

యంగ్ సెన్సేషన్ కిరణ్ అబ్బవరం హీరోగా కోడి రామ‌కృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాత‌గా త‌న ప్రొడ‌క్ష‌న్ నెం 1 గా కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌లో చేస్తున్న సినిమా “నేను మీకు బాగా కావాల్సినవాడిని”. SR కళ్యాణమండపం లాంటి సూపర్ హిట్ చిత్రం తరువాత దర్శకుడు శ్రీధర్ గాదే, రాజావారి రాణిగారు, SR క‌ళ్యాణ‌మండ‌పం లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బ‌వ‌రం కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం చాలా కొత్తగా కమర్షియల్ గా కనిపిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ అద్బుత‌మైన సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ఆడియోని ల‌హ‌రి ద్వారా మార్కెట్ లోకి తీసుకువస్తున్నారు. కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా “నేను మీకు బాగా కావాల్సినవాడిని” సినిమా వస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతుంది. మరికొన్ని రోజుల్లో చిత్ర షూటింగ్ పూర్తి కానుందని, ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియచేస్తామని దర్శక నిర్మాతలు చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :