సూర్య “జై భీమ్” చిత్రం పై కోనా వెంకట్ ప్రశంసల వర్షం!

Published on Nov 16, 2021 2:30 pm IST

సూర్య హీరోగా జ్ఞానవేల్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం జై భీమ్. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో లో ప్రసారం అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం కి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ చిత్రం పై ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం పై టాలీవుడ్ ప్రముఖ రైటర్ కోనా వెంకట్ ప్రశంసల వర్షం కురిపిస్తూ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

ఒక మాస్టర్ పీస్ ను అభినందించడం ఎప్పటికీ ఆలస్యం కాదు అని వ్యాఖ్యానించారు. మేకర్స్ ఈ చిత్రాన్ని చాలా చక్కగా నిర్మించారు అని, హృదయానికి హత్తుకునేలా చిత్రం ఉంది అని తెలిపారు. ఈ కథ ను ఎంచుకున్నందుకు సూర్య గారికి నమస్కరించారు కోనా వెంకట్. అంతేకాక ఈ చిత్రాన్ని నిర్మించిన జ్యోతిక కు మరియు దర్శకత్వం వహించిన జ్ఞాన వేల్ కి అభినందనలు తెలిపారు.

సంబంధిత సమాచారం :