వైష్ణవ్‌ తేజ్‌ “కొండపొలం” ట్రైలర్‌కి ముహూర్తం ఫిక్స్..!

Published on Sep 25, 2021 9:11 pm IST

మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొండపొలం’. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు మరియు ఓబులమ్మ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ట్రైలర్‌ను 27వ తేది సోమవారం సాయంత్రం 3.33 గంటలకు విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది.

ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి మరియు రాజీవ్ రెడ్డిలు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 8న విడుదల చేస్తున్నట్టు ఇదివరకే ప్రకటించారు. అయితే ఈ సినిమా వాయిదా పడబోతుందని వస్తున్న పుకార్లపై చిత్ర బృందం ట్రైలర్‌తో పాటు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇకపోతే ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :