రూమర్స్ ను ఖండించిన సినియర్ నటుడు !
Published on Nov 11, 2017 5:00 pm IST

ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తోంది. ముఖ్యంగా యూత్ ట్యూబ్ చానెల్స్ ఎక్కువ అయిపోయాయి. లేని వార్తలు ఉన్నట్లు ఉన్న వార్తలు లేనట్లు రాసే యూట్యూబ్ చానెల్స్ ఎక్కువ దర్శనం ఇస్తున్నాయి. ఈమధ్య ప్రముఖ సింగర్ పి. సుశీల గారు చనిపోయారని రకరకాలుగా వార్తలు వచ్చాయి. దీనిపై ఆమే స్పందిస్తూ.. తాను బాగున్నానని అటువంటి రూమర్స్ పై స్పందించవద్దని ఒక వీడియో తీసి పంపారు. దీనితో ఆమె ఆరోగ్యనగా ఉన్నారని ప్రపంచానికి తెలిసింది.

తాజాగా ప్రముఖ నటుడు కోటా శ్రీనివాస్ రావ్ గారి ఆరోగ్య పరిస్థితి బాగోలేదని. అతను హాస్పిటల్ లో చేరారని రకరకాలుగా యూట్యూబ్ ఛానల్ లో వార్తలు వచ్చాయి. వీటిపై కోట శ్రీనివాస్ స్పందిస్తూ మీడియా సమక్షంలో తాను బాగున్నానని, బయట వచ్చే రూమర్స్ ను నమ్మవద్దని తెలిపారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook