‘కిల్ బిల్’ రీమేక్లో కృతి సనన్ !

Published on Jun 22, 2021 11:02 pm IST

హాలీవుడ్ క్లాసిక్స్ జాబితాలో క్వాంటిన్ టరంటినో డైరెక్ట్ చేసిన ‘కిల్ బిల్’ కూడ ఉంటుంది. ఉమ తుర్మన్ ప్రధాన పాత్రలో 2003లో, 2004లో రెండు భాగాలుగా విడుదలైంది ఈ చిత్రం. అకాడమీ అవార్డులకు కూడ ఈ చిత్రం ఎంపికైంది. సినిమా హిస్టరీలో బెస్ట్ రివెంజ్ కమ్ యాక్షన్ డ్రామా అంటే ‘కిల్ బిల్’ పేరే చెబుతారు. అలాంటి సినిమాను హిందీలోకి రీమేక్ చేస్తున్నారు. ఈ రీమేక్ హక్కులను నిఖిల్ ద్వివేది కొనుగోలుచేశారు.

లాక్ డౌన్ సమయంలో డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, నిఖిల్ ద్వివేది ఇద్దరూ కలిసి ‘కిల్ బిల్’ స్క్రిప్ట్ మీద వర్క్ చేసి హిందీ భాషకు సరిపోయే స్క్రిప్ట్ తయారుచేసుకున్నారట. త్వరలోనే సినిమాను మొఅలుపెట్టాలనే ఆలోచనతో ప్రధాన పాత్ర కోసం కృతి సనన్ పేరును ఫైనల్ చేసుకున్నారట. ఇప్పటికే కృతి సనన్ ను సంప్రదించడం ఆమె కూడ సినిమా చేయడానికి సుముఖత వ్యక్తం చేయడం జరిగిందట. ‘కిల్ బిల్’ లాంటి క్లాసిక్ మూవీని రీమేక్ చేయడమే సాహసం అనాలి. అలాంటి సినిమాలో అవకాశం దక్కించుకోవడం కృతి సనన్ లాక్. ఇకపోతే కృతి సనన్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆదిపురుష్ ‘ నందు సీత పాత్రలో కనబడనుంది.

సంబంధిత సమాచారం :