ఆ స్టార్ హీరో భార్యకు అభిమానిగా మంచు లక్ష్మి !

Published on Nov 15, 2018 12:16 pm IST

మంచు లక్ష్మి ఎప్పుడూ వైవిధ్యమైన పాత్రలను చేయాలని కోరుకుంటారు. ఇప్పుడు ఆమె అలాంటి పాత్రనే జ్యోతిక నటిస్తోన్న ‘కాట్రిన్‌ మొళి’ చిత్రంలో పోషిస్తున్నారు.
హిందీలో నేహా దూపియా చేసిన పాత్రను తమిళ్ వర్షన్ లో మంచు లక్ష్మి పోషిస్తున్నారు.

కాగా ఈ చిత్రంలో జ్యోతికతో కలిసి నటించడం గురించి మంచు లక్ష్మి మాట్లాడుతూ…జ్యోతికతో పనిచేయడం నాకెంతో అద్భుతంగా అనిపించింది. తన టాలెంట్ చూశాక నేను జ్యోతికకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. తను ఎన్నో భావాలను, కేవలం తన కళ్లతోనే అవలీలగా పలికించగలదు అని మంచు లక్ష్మి జ్యోతిక పై తనకున్న అభిమానాన్ని తెలిపారు.
.
బోఫ్తా మీడియా వర్క్స్‌ పతాకం పై ధనుంజయన్‌ గోవింద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాధా మోహన్‌ దర్శకుడు. ఈ చిత్రం పై ఇప్పటికే ప్రేక్షకుల్లో కూడా భారీగా అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :

X
More