టాప్ లో ట్రెండ్ అవుతోన్న “లాలా భీమ్లా”

టాప్ లో ట్రెండ్ అవుతోన్న “లాలా భీమ్లా”

Published on Nov 11, 2021 1:23 AM IST


పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి ప్రధాన పాత్రల్లో సాగర్ కే చంద్ర దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం భీమ్లా నాయక్. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, విడియోలు, పాటలు సినిమా పై భారీ అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ చిత్రం నుండి లాలా భీమ్లా లిరికల్ వీడియో విడుదల అయ్యింది.

ఈ లాలా భీమ్లా పాట సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అవుతోంది. అదే విధంగా యూ ట్యూబ్ లో సైతం భారీ వ్యూస్ తో దూసుకు పోతుంది. ఈ పాట యూ ట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం ఈ లిరికల్ వీడియో సాంగ్ కి 13 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. ఈ పాటకి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లిరిక్స్ అందించారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు