“ఆచార్య” నుంచి మరో మ్యాజికల్ సాంగ్ పై లేటెస్ట్ అనౌన్సమెంట్.!

Published on Apr 16, 2022 4:12 pm IST

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెగా తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం “ఆచార్య” కోసం అందరికీ తెలిసిందే. బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్ బడ్జెట్ సినిమా ఇప్పుడు రిలీజ్ కి సిద్ధం అవుతుండగా మేకర్స్ ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో బిగ్ అనౌన్స్మెంట్ ని అందించారు.

మరి దీని ప్రకారం అయితే ఈ సినిమా నుంచి మరో సాంగ్ ని లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించారు. “భళే భళే బంజారా” అనే ట్రాక్ లైన్ తో ఉండే ఈ సాంగ్ ని ఈ ఏప్రిల్ 18న రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. అంతే కాకుండా దీనిపై మెగాస్టార్ మరియు చరణ్, దర్శకుడు కొరటాల పై ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ని కూడా మేకర్స్ తీసుకొచ్చారు. మరి మొత్తానికి అయితే మెగాస్టార్ మరియు మణిశర్మ ల నుంచి మరో మ్యాజికల్ ట్రాక్ కోసం ఏప్రిల్ 18 వరకు ఆగాల్సిందే.

కొరటాల, చిరు – చరణ్ ల ఆ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :