లేటెస్ట్..సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై తాజా బులెటిన్!

Published on Sep 12, 2021 1:34 pm IST


రీసెంట్ గా మన టాలీవుడ్ యువ హీరో సుప్రీమ్ సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురి అయ్యిన సంగతి తెలిసిందే. మరి తేజ్ కి ప్రమాదం అయ్యిన వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించడం మెగాస్టార్ మరియు ఇతర కుటుంబ సభ్యులు తన ఆరోగ్యాన్ని దగ్గరుండి చూసుకోవడం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సాయి తేజ్ పై ఎంతో మందికి ఇంత ప్రేమ ఉందా అన్న ఈ సందర్భంలో తన ఆరోగ్యంపై అపోలో ఆసుపత్రి వారు టైం టు టైం సమాచారాన్ని కూడా అందిస్తున్నారు.

మరి తాజాగా తన ఆరోగ్య స్థితిపై బులెటిన్ ని రిలీజ్ చేసారు. సాయి తేజ్ కి మీద ఎముక దగ్గర అయ్యిన ఫ్రాక్చర్ కి ఆపరేషన్ విజయవంతంగా కంప్లీట్ అయ్యింది అని తెలిపారు. అంతే కాకుండా సాయి తేజ్ ప్రస్తుతం కోలుకుంటున్నాడని ఆరోగ్యం కూడా నిలకడగా ఉందని కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతానికి అయితే అబ్జర్వేషన్ లో ఉన్న తేజ్ మళ్ళీ తిరిగి త్వరగా కోలుకొని సినిమాలు స్టార్ట్ చేసి అందరినీ అలరించాలని ఆశిద్దాం..

సంబంధిత సమాచారం :