రాజమౌళి సినిమాలో కొత్త హీరోయిన్ ?

28th, March 2018 - 09:14:56 AM

ఎస్.ఎస్.రాజమౌళి తన మల్టీ స్టారర్ పనుల్ని వేగవంతం చేశారు. ఒకవైపు స్క్రిప్ట్ పనులు జరుగుతుండగానే మరోవైపు చరణ్, ఎన్టీఆర్ ల సరసన కథానాయికల ఎంపిక కూడ జరుగుతోంది. ఇప్పటికే హీరోయిన్ల జాబితాలో రకుల్ ప్రీత్ సింగ్, రాశీ ఖన్నాల పేర్లు వినిపించగా ఇప్పుడు మరొక కొత్త హీరోయిన్ పేరు కూడ ప్రముఖంగా వినిపిస్తోంది.

ఆమె మరెవరో కాదు ఇటీవలే ‘ఛలో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రష్మిక మందన్న. ప్రస్తుతం ఈమె నాని, నాగార్జునల మల్టీ స్టారర్లో కూడ నటిస్తోంది. ఈమె పేరు కూడ జక్కన్న లిస్టులో ఉందని అంటున్నారు. మరి వీరి ముగ్గురిలో రాజమౌళి ఏ ఇద్దర్ని ఎంపిక చేస్తారో లేకపోతే వేరెవరినైనా ఎంచుకుంటారో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే. ఇకపోతే ఈ భారీ మల్టీ స్టారర్ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించనున్నారు.