లేటెస్ట్.. “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” టీజర్ విడుదలకి సమయం, తేదీ ఫిక్స్

లేటెస్ట్.. “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” టీజర్ విడుదలకి సమయం, తేదీ ఫిక్స్

Published on Apr 24, 2024 11:00 AM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “గామి” తో తన కెరీర్ లో మరో మంచి హిట్ ని అందుకోగా ఈ సినిమా తర్వాత తన నుంచి రానున్న ఓ పక్కా మాస్ ఎంటర్టైనర్ చిత్రమే “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”. దర్శకుడు కృష్ణ చైతన్య తెరకెక్కించిన ఈ చిత్రంపై ఇది వరకే మంచి బజ్ నెలకొంది.

పాటలు, ప్రమోషనల్ కంటెంట్ అన్నీ కూడా సాలిడ్ రెస్పాన్స్ ని అందుకోగా ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం నుంచి మేకర్స్ ఇప్పుడు సాలిడ్ అప్డేట్ అందించారు. ఈ సినిమా టీజర్ ని ఈ ఏప్రిల్ 27న సాయంత్రం 4 గంటల 1 నిమిషానికి అయితే లాంచ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ఇప్పుడు ఫిక్స్ చేశారు.

ఓ లాంచ్ ఈవెంట్ ద్వారా ఈ టీజర్ ని విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించగా ఇంకా వేదిక ఏంటి ఎక్కడ అనే వివరాలు రావాల్సి ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో నేహా శెట్టి (Neha Shetty) హీరోయిన్ గా నటించగా రీసెంట్ సెన్సేషన్ అయేషా ఖాన్ (Ayeshaa Khan) స్పెషల్ సాంగ్ చేసింది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు