“వీరమల్లు” పై మరో అప్డేట్ ఇచ్చిన క్రిష్..!

Published on Oct 4, 2022 11:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. పవన్ కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా దీనిని దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండగా ఈ చిత్రానికి పవన్ తీసుకుంటున్న కేర్ కూడా ఇపుడు ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరుస్తుంది. దీనితో ఈ చిత్రంపై మరిన్ని అంచనాలు నెలకొల్పుకోగా ఈ చిత్రం ఇప్పుడు శరవేగంగా వర్క్ షాప్ షెడ్యూల్ చేస్తున్న సంగతి తెలిసిందే.

మరి దీనిపై అయితే దర్శకుడు క్రిష్ లేటెస్ట్ అప్డేట్ ని అందించారు. ఈ చిత్రం వర్క్ షాప్ షెడ్యూల్ అయితే ఇక ఈ రోజుతో కంప్లీట్ అవుతుందని తన ఇన్స్టాగ్రామ్ తెలియజేసారు. ఇక ఈ సినిమా కొత్త షెడ్యూల్ అయితే ఈ అక్టోబర్ మధ్య నుంచి స్టార్ట్ కానుండగా పవన్ చురుగ్గా ఇందులో పాల్గొననున్నారు. ఇక ఈ అవైటెడ్ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :