లేటెస్ట్..తన గ్రాండ్ షో కంప్లీట్ చేసేసిన తారక్..?

Published on Oct 23, 2021 5:42 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం జెమినీ ఛానెల్లో ప్రసారం అవుతున్న బిగ్ రియాలిటీ షో “ఎవరు మీలో కోటీశ్వరులు” చేస్తున్న సంగతి తెలిసిందే. తాను వ్యాఖ్యాతగా ఎన్నో అంచనాలతో స్టార్ట్ అయ్యిన ఈ షోను తన మార్క్ హోస్టింగ్ తో గతంలో ఏ సీజన్ కి రాని విధమైన రెస్పాన్స్ ని తీసుకొచ్చాడు.

అయితే పలువురు సినీ తారలతో కూడా అద్భుతంగా ఆడించిన తారక్ ఇప్పుడు ఎట్టకేలకు ఈ షో కి సెలవు ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. తాజాగా తారక్ ఈ షో తాలూకా సీజన్లో చిట్ట చివరి ఎపిసోడ్ ని కంప్లీట్ చేసేసినట్టు తెలుస్తుంది. అలానే దానికి సంబంధించిన ఫోటో కూడా ఒకటి వైరల్ అవుతుంది.

మరి దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే సూపర్ స్టార్ మహేష్ తో ప్లాన్ చేసిన గ్రాండ్ ఎపిసోడ్ ని ఈ షోలో ఫైనల్ గా షెడ్యూల్ చేసినట్టుగా కూడా బజ్ ఉంది. మరి ఇంకొన్ని రోజుల్లో వీటన్నంటికీ క్లారిటీ రానున్నాయి.

ఇక ఈ షో అయ్యాక తారక్ కొరటాల శివ తో ప్లాన్ చేసిన భారీ పాన్ ఇండియన్ సినిమాలో ఎంటర్ కానున్నాడు. అందుకే ఆల్రెడీ తన మేకోవర్ ని కూడా చేంజ్ చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

More