మహేశ్‌ బాబుకి రాజకీయాల పై ఆసక్తి లేదు !

Published on Feb 11, 2019 12:00 am IST

సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు, నమ్రత శిరోద్కర్‌ ల పెళ్లి రోజు నేడు. కుటుంబంతో ఎక్కువ గడిపే మహేష్.. తరచూ తన భార్య పిల్లలకు సంబంధించిన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటారు. కాగా తమ 14వ పెళ్లిరోజు సందర్భంగా మహేష్ బాబు తన భార్యతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘ఎన్నో మధురమైన జ్ఞాపకాలు. మై లవ్ కి హ్యాపీ యానివర్సరీ’ అని పోస్ట్ చేసారు.

అలాగే తమ పెళ్లి రోజు సందర్భంగా ఓ ప్రముఖ పత్రికకు నమ్రత ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో మహేష్ బాబు రాజకీయాల్లోకి వస్తారా అని ప్రశ్నకు ఆమె నవ్వుతూ… ఆయనకి రాజకీయాల పై ఎలాంటి ఆసక్తి లేదు. ప్రస్తుతం ఆయన ఫోకస్‌ అంతా యాక్టింగ్ మీదే. అలాగే ఆయనకి సినిమాలు అంటే అమితమైన ప్రేమ. సినిమాలు తప్ప మరో విషయం గురించి ఆయన ఆలోచించరు. ఖచ్చితంగా ఆయన అయితే రాజకీయాల్లోకి రారు’.

సంబంధిత సమాచారం :