‘ఆదర్శ కుటుంబం’ వాయిదాకి కారణం అదే ?

‘ఆదర్శ కుటుంబం’ వాయిదాకి కారణం అదే ?

Published on Oct 5, 2026 2:00 PM IST

విక్టరీ వెంకటేష్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం’. ఈ సినిమా అక్టోబర్ 9న విడుదల కావటం లేదు. నిర్మాత నాగవంశీ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో సినిమా విడుదల పై ఆయన క్లారిటీ ఇవ్వనున్నారు. అలాగే, విడుదల వాయిదా వేయటానికి కారణాలను కూడా ఆయన చెప్పనున్నారు. ఇప్పుడున్న అప్ డేట్ ప్రకారం.. దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 30న విడుదల చేయాలి అనుకుంటున్నారు.

ఏది ఏమైనా అక్టోబర్ 9 చాలా మంచి డేట్. కానీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడం వల్ల సినిమా వాయిదా వేశారని తెలుస్తోంది. అంటే రిలీజ్ పోస్ట్ ఫోన్ కి కారణం.. ఫస్ట్ కాపీ రెడీ కాకపోవడమే. గా ఈ సినిమాలో నివేథా పేతురాజ్, నారా రోహిత్, పూజిత పొన్నాడ, రావు రమేష్ మరియు బ్రహ్మాజీ ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ పై భారీ అంచనాలు ఉన్నాయి.

తాజా వార్తలు